'కబాలి' సినిమా విడుదల తేదీ ఖరారైంది

- May 12, 2016 , by Maagulf
'కబాలి' సినిమా విడుదల తేదీ ఖరారైంది

రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న 'కబాలి' సినిమా విడుదల తేదీ ఖరారైంది. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా జూన్‌లోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే, తాజాగా తేదీని జూలై 1గా ఖరారు చేశారు. జూలై 7కు విడుదల చేసే అవకాశాన్ని చిత్ర యూనిట్ పరిశీలించినప్పటికీ, అదే తేదీన సల్మాన్ ఖాన్‌ 'సుల్తాన్‌' చిత్రం వస్తుండటంతో దానితో పోటీ లేకుండా జూలై 1కి ఫిక్స్ అయ్యారని చిత్రవర్గాలు మీడియాకు తెలిపాయి.పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కబాలి' సినిమాలో రజనీ వృద్ధ డాన్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో నటించిన తైవానీ నటుడు విన్‌స్టన్‌ చావో కూడా తాజాగా చెన్నైలోని డబ్బింగ్‌ టీమ్‌తో చేరాడు. రజనీతోపాటు రాధికా ఆప్టే, ధన్సికా, రిత్విక తదితరులు నటిస్తున్న ఈ సినిమాను కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com