రామ్ - బోయపాటి.! క్లైమాక్స్ కోసం అంత భారీ బడ్జెట్టా.?
- June 05, 2023
బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు అత్యంత భయంకరంగా పవర్ ఫుల్‌గా డిజైన్ చేస్తుంటాడు. ఆయన గత చిత్రాల నుంచీ తాజాగా ‘అఖండ’ సినిమా వరకూ యాక్షన్ ఘట్టాలన్నీ ప్రత్యేకమే.
ఇక, ఆయన తాజాగా రామ్ పోతినేనితో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కూడా ఏమాత్రం రాజీ పడడం లేదట. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్‌లో వచ్చే యాక్షన్ ఘట్టం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో చాలానే యాక్షన్ సీన్లుండబోతున్నాయట. వాటిలో క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ నభూతో న భవిష్యతి అనేలా వుండబోతోందట.
ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 24 కోట్లు ఖర్చ పెట్టబోతున్నారనీ తెలుస్తోంది. అలాగే, 24 రోజుల పాటు ఏకధాటిగా ఈ సన్నివేశం చిత్రీకరించబోతున్నారట. దాదాపు 100 మందితో ఈ యాక్షన్ ఘట్టం డిజైన్ చేశాడట బోయపాటి.
అంటే, ‘మగధీర’లోని యాక్షన్ సీన్ గుర్తొస్తోంది కదా.. అంతకు మించి అనేలాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ వుండబోతోందనీ లేటెస్టుగా రామ్ పోతినేని చెప్పడం సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







