దాసరి అవార్డుకు అర్హుడు గూడ రామకృష్ణ
- June 08, 2023
హైదరాబాద్: ప్రముఖుల పేరిట బహుకరించే పురస్కారాలు అర్హులకు అందితే వాటికి గౌరవం పెరుగుతుందని వంశీ సంస్థల వ్యవస్థాపకుడు వంశీ రామరాజు అన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దర్శకులు, దర్శకరత్న డా.దాసరి నారాయణరావు పేరిట స్థాపించిన అవార్డ్ అందుకున్న గూడ రామకృష్ణ అందుకు అర్హుడని అభినందించారు. శ్రీ త్యాగరాయ గాన సభ లోని కళా దీక్షితులు కళా వేదిక పై సుజారమణ కల్చరల్ అకాడెమీ నిర్వహణలో దర్శకరత్న దాసరి నారాయణ రావు సుజారమణ పురస్కారం సీనియర్ దర్శకుడు నటుడు గూడ రామకృష్ణ కు ప్రదానోత్సవ సభ జరిగింది. అధ్యక్షత వహించిన వంశీ రామ రాజు మాట్లాడుతూ కళా సంస్థలే దేవాలయాలు కళాకారులే దైవ స్వరూపాలు అన్నారు.ముఖ్య అతిధి గా పాల్గొన్న శత చిత్ర నిర్మాత సినీ విరాట్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ గూడ రామ కృష్ణ ఎన్నో ఏళ్ళు దాసరికి అత్యంత ప్రీతి పాత్ర శిష్యులు అన్నారు.. ఆయన తీసిన సినిమాలు ప్రభుత్వ అవార్డ్ పొందాయన్నారు.. అవార్డ్ గ్రహీత రామ కృష్ణ మాట్లాడుతూ దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆయన అంత సహృదయులు లేరని అన్నారు. గాయని శ్రీమణి పాల్గొన్న సభకు రమణా రావు స్వాగతం పలికారు. సుజారమణ,సనత్ కుమార్, శ్రీనివాస్,అనూష శశి రేఖ, కె వి రావు తదితరుల పాటలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!









