ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో జూన్ 16న బీచ్ క్లీనింగ్ కార్యక్రమం

- June 10, 2023 , by Maagulf
ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో జూన్ 16న బీచ్ క్లీనింగ్ కార్యక్రమం

కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం, UN సంస్థ సంయుక్తంగా జూన్ 16న(శుక్రవారం)  బీచ్ క్లీనింగ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి. బీచ్ క్లీనింగ్ కార్యక్రమం తెల్లవారుజామున 5:00 నుండి 6:00 వరకు బ్నీడ్ అల్ గార్ (వింపీ దగ్గర) ఎదురుగా ఉన్న బీచ్‌లో జరుగుతుంది.  ఈ ఈవెంట్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌లో భాగం అని ఇండియన్ ఎంబసీ వర్గాలు తెలిపాయ. 26వ UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP26)లో ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ లైఫ్(LiFE) ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది స్థిరమైన జీవనశైలిని అవలంబించే వ్యక్తులను 'ప్రో ప్లానెట్ పీపుల్'గా మార్చడానికి కృషి చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com