బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

- June 11, 2023 , by Maagulf
బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ బర్త్ డే వేడుకలు బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ భారీ కేక్‌ కట్ చేసి , చిన్నారులకు కేక్ తినిపించి.. గిఫ్ట్స్‌ అందించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన సిబ్బంది, వైద్యులు, రోగులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పుట్టిన రోజు వేడుకల తనకు బాధ్యతలను మరోసారి గుర్తు చేశాయని తెలిపారు. భూమ్మీద మహానుభావులు కొందరే ఉంటారని, తాము సమాజానికి ఎలా ఉపయోగపడతామా అని వారు ఆలోచిస్తారని చెప్పారు.

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తి అని బాలయ్య అన్నారు. ముఖ్యమంత్రిగా, నటుడిగా, ఆసుపత్రి వ్యవస్థాపకునిగా ఎన్టీఆర్ ఎన్నో గొప్ప పనులు చేశారని, వారి అడుగుజాడల్లోనే తాను నడవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తన తండ్రి పేద వారికి అందుబాటు ధరలలో నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నెలకొల్పిన ఈ ఆసుపత్రి ఎందరికో ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా దృక్పధంతో సేవలు అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ నిరంతరాయంగా ఈ సేవలు అందించేందుకు కృషి చేస్తానని బాలయ్య ప్రకటించారు.

అటు, యూఎస్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో కూడా నందమూరి బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. అతి పెద్ద బిల్ బోర్డ్‌పై బాలకృష్ణ సినిమా సీన్స్‌.. ఫోటోలు ప్రదర్శించారు. ఆయన ఫోటోలు 24 గంటల పాటు ప్రదర్శనకు ఉంచారు. కేక్‌ కట్‌ చేసి.. జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com