3-నెలల విజిటర్ వీసాను తిరిగి ప్రవేశపెట్టిన యూఏఈ

- June 14, 2023 , by Maagulf
3-నెలల విజిటర్ వీసాను తిరిగి ప్రవేశపెట్టిన యూఏఈ

యూఏఈ: యూఏఈ మూడు నెలల విజిట్ వీసాను తిరిగి ప్రవేశపెట్టింది. మూడు నెలల లేదా 90 రోజుల వీసా గత సంవత్సరం చివరిలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎక్కువ కాలం పాటు దేశాన్ని సందర్శించడానికి ఇష్టపడే సందర్శకుల కోసం దీర్ఘకాలిక 60 రోజుల వీసా ప్రవేశపెట్టింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. 90 రోజుల పాటు యూఏఈ ని సందర్శించడానికి ఇష్టపడే వ్యక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అయితే సర్వీస్ ప్రొవైడర్ ఆధారంగా అదనపు ధరతో దేశంలో వీసా పొడిగించవచ్చు.

ప్రస్తుతం రెండు రకాల ఎంట్రీ పర్మిట్‌లు ఉన్నాయి. టూరిస్ట్ వీసా లేదా లీజర్ వీసా, విజిట్ వీసా. పర్యాటక వీసా 30 లేదా 60 రోజులకు జారీ చేయబడుతుంది. విజిట్ వీసా 90 రోజుల పాటు జారీ చేయబడుతుందని రీగల్ టూర్స్ వరల్డ్‌వైడ్‌లో ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ కార్యకలాపాలకు సీనియర్ మేనేజర్ సుబైర్ తెకెపురాత్‌వలప్పిల్ తెలిపారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
అధికారులు తిరిగి ప్రవేశపెట్టిన ఈ మూడు నెలల వీసా గురించి నివాసితులకు తెలియదని రూహ్ టూరిజం LLC సేల్స్ డైరెక్టర్ లిబిన్ వర్గీస్ తెలిపారు. ఈ వీసా కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దుబాయ్, అబుధాబిలకు ఇది చెల్లుబాటు అవుతుందని పరిశ్రమ నిపుణులు తెలిపారు.  

వీసా రుసుము
90-రోజుల-విజిట్ వీసా కోసం రుసుము మీ జారీ చేసే ప్రయాణ నిపుణుడిని బట్టి మారుతుంది. ప్రారంభ ధర Dh1,500, Dh2,000 వరకు ఉండవచ్చని వర్గీస్ చెప్పారు.

లాంగ్ టర్మ్ విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇటీవలి పాస్‌పోర్ట్-పరిమాణ రంగు ఫోటో, పాస్పోర్ట్ కాపీ సమర్పించాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com