మాక్రాన్‌ను కలవనున్న క్రౌన్ ప్రిన్స్
- June 15, 2023
పారిస్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం ఎలిసీ ప్యాలెస్‌లో వారి అధికారిక సమావేశంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో విస్తృత చర్చలు జరుపుతారు. క్రౌన్ ప్రిన్స్ బుధవారం ఫ్రాన్స్‌కు అధికారిక పర్యటన కోసం వచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. పారిస్‌లో బిజీ షెడ్యూల్ ఉన్నా ఎక్స్‌పో 2030 బిడ్‌ను ప్రోత్సహించడానికి సౌదీ అరేబియా అధికారిక రిసెప్షన్‌కు కూడా క్రౌన్ ప్రిన్స్ హాజరవుతారు. ప్యారిస్‌లో చర్చల కోసం క్రౌన్ ప్రిన్స్‌ను మాక్రాన్ స్వాగతం చెబుతారని ఎలిసీ ప్యాలెస్ అధికారిక ప్రతినిధి తెలిపారు. ఈ భేటీ సందర్భంగా మాక్రాన్, క్రౌన్ ప్రిన్స్ మధ్యప్రాచ్య వ్యవహారాలు, అంతర్జాతీయ సమస్యలపై చర్చిస్తారని వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహించేందుకు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఇటీవల సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జూన్ 22-23 తేదీల్లో ప్యారిస్‌లో జరగనున్న "ఫర్ ఏ న్యూ గ్లోబల్ ఫైనాన్షియల్ ప్యాక్ట్" పేరుతో ఆర్థిక సదస్సులో పాల్గొనే కింగ్‌డమ్ ప్రతినిధి బృందానికి క్రౌన్ ప్రిన్స్ నాయకత్వం వహిస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల