వలసదారుల చెల్లింపుల్లో ఒమన్‌కి ప్రత్యేక స్థానం
- May 13, 2016
వలసదారుల చెల్లింపులకు సంబంధించి ప్రపంచంలోని ప్రముఖ దేశాల సరసన ఒమన్ స్థానం దక్కించుకుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జిడిపి) పర్సంటేజ్ ప్రకారం 2016 వరల్డ్ బ్యాంక్ మైగ్రేషన్ చెల్లింపుల వాస్తవ పుస్తకంలో ఈ వివరాలు వెలుగు చూశాయి. ఒమన్ జీడీపీలో 12.6 శాతం అగ్రిగేట్ ఔట్‌ఫ్లోస్ నమోదయ్యాయి. ఒమన్ జిడిపి 27 ఒమన్ రియాల్స్‌గా నమోదైంది 2015లో. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ వివరాల్ని వెల్లడించింది. టాప్ ప్లేస్‌లో ఉన్న రెమిటెన్స్ సెండింగ్ దేశాల్లో లగ్జెంబర్గ్ 19.6 శాతంతో ముందంజలో ఉండగా, లైబీరియా 18.2 శాతం, మార్షల్ ఐలాండ్స్ 12.8 శాతంతో ఉన్నాయి. ఒమన్ 12.6 శాతం. ఒమన్ తర్వాత లెబనాన్ 12.3 శాతంతోనూ, కువైట్ 11 శాతంతోనూ ఉండగా మిగతా జిసిసి దేశాలు 10 శాతం కంటే తక్కువగా నమోదయ్యాయి. వలసదారుల కారణంగా రెమిటెన్స్ ఔట్‌ఫ్లో గల్ఫ్ దేశాల్లో అధికంగా ఉంటుందని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఎన్.గురుముర్తి చెప్పారు. రీజియన్‌లో వలసదారుల సంఖ్య 40 నుంచి 50 శాతంగా ఉంటుంది. ఇది యూఏఈలో ఇంకా ఎక్కువే ఉంటుంది. అమెరికా ఈ విషయంలో తొలి స్థానంలో నిలిచింది. సౌదీ అరేబియా రెండో స్థానంలో, రష్యా మూడో స్థానంలో ఉన్నాయి. అమెరికా 56.3 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ ఔట్‌ఫ్లో కలిగి ఉంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







