ఈ నెల 19 నుంచి ఏపీలో వర్షాలు..
- June 17, 2023
అమరావతి: ఏపిలో ఎండల తీవ్రత మరో రెండు రోజులేనని, ఆ తర్వాత రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా రాష్ట్రంలో ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదని, దీనికి కారణం రుతుపవనాలు విస్తరించకపోవడమేనని తెలిపింది. తాజాగా ఈ నెల 18 నుంచి 21 వరకు రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, దీంతో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కోస్తాంద్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు. శని, ఆది వారాల్లో (నేడు, రేపు) రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!







