సిటీ సెంటర్‌లో ఆకట్టుకున్న మిల్లెట్ ఫెస్టివల్
- June 18, 2023
కువైట్: కువైట్‌లోని ప్రముఖ హైపర్‌మార్కెట్ చైన్ సిటీ సెంటర్ వారి సాల్మియా షోరూమ్‌లో మిల్లెట్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. మిల్లెట్ ఫెస్టివల్‌ను కువైట్‌లోని భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిటీ సెంటర్ సీఓఓ శ్రీ అజయ్ గోయెల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మిల్లెట్ ఫెస్టివల్ నెలరోజుల ప్రచారంలో భాగంగా మిల్లెట్ యొక్క పోషక, ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడంతోపాటు, స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. దేశంలోని పలు సిటీ సెంటర్ స్టోర్‌లలో భారతదేశంలోని వివిధ రకాల మిల్లెట్‌లు అందుబాటులో ఉన్నాయి. మిల్లెట్ ఫెస్ట్‌లో భాగంగా వివిధ రకాల రుచికరమైన మిల్లెట్ వంటకాలను చెఫ్ ఛాయా ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, మార్చి 2021లో దాని 75వ సెషన్‌లో 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (IYM2023)గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!







