రియాల్టీ కాంట్రాక్ట్ వివాదం.. కస్టమర్కు BD5000 రీఫండ్
- June 18, 2023
బహ్రెయిన్: కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో లోయర్ సివిల్ కోర్ట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మొట్టికాయలు వేసింది. కస్టమర్ కు BD5,000 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం, కస్టమర్ కొనుగోలు ప్రక్రియను రెండు నెలల్లోగా పూర్తి చేయడంలో విఫలమైతే వాపసు పొందేందుకు అర్హత ఉండదు. అయితే, ఫిర్యాది ఒకే చెక్కులో పూర్తి చెల్లింపు చేసినందున, వారు రిఫండ్ పొందేందుకు అర్హులని కోర్టు నిర్ధారించింది. ఫిర్యాదుదారు రెండు నెలల వ్యవధిలో విల్లాను కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కేసు దాఖలైంది. వ్యక్తి మజాయా ప్రోగ్రామ్ ద్వారా ఫైనాన్సింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఒకే చెక్కు ద్వారా సింగిల్ పేమెంట్ చేసినా రిఫండ్ కోసం అభ్యర్థించినప్పుడు, కంపెనీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, చెల్లింపు ఆలస్యం అయిందని పేర్కొంటూ నిరాకరించింది.దీంతో కస్టమర్ కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







