మాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా.. ప్రెక్షకులకు కాంప్లిమెంటరీ టిక్కెట్స్..!
- June 19, 2023
దుబాయ్: దుబాయ్‌లోని ఒక మాల్లో శుక్రవారం అర్థరాత్రి విద్యుత్తు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. అల్ బార్షాలోని మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వద్ద విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.దీంతో VOX సినిమాస్ లో ఉన్న ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ముందు జాగ్రత్తగా వారిన బయటకు పంపించారు. కాగా, బాధితులైన వారి సౌలభ్యం మేరకు VOX సినిమాస్‌కి మళ్లి రావడానికి కాంప్లిమెంటరీ టిక్కెట్ జారీ చేయనున్నట్టు మాల్ నిర్వాహకులు తెలిపారు. కొద్ది గంటల్లోనే విద్యుత్‌ను వెంటనే పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.అయితే, సినిమా ప్రేక్షకులను క్రమ పద్ధతిలో ఖాళీ చేయిస్తున్నట్లు చూపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్‌లో విద్యుత్తు అంతరాయాలు చాలా అరుదు. ఏప్రిల్ 2017లో దుబాయ్ మాల్లో దాదాపు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరుసటి రోజు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, రియల్ ఎస్టేట్ డెవలపర్లు మరియు కంపెనీలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేందుకు అదనపు విద్యుత్ జనరేటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







