ఆకుకూరల్లో ఈ కూరను మీరు తింటున్నారా.?
- June 19, 2023
తోటకూర, గోంగూర, పాలకూర తదితర అనేక ఆకు కూరలు మన ఆరోగ్య అవసరాల్ని తీర్చడంలో ఎంతగానో ఉపయోగపడతాయ్.
ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఐరన్ సరఫరా జరిగి రోగ నిరోధక శక్తి లభించడంతో పాటూ, రక్త హీనత వంటి సమస్యలు దరి చేరకుండా వుంటాయ్.
అయితే, ఆకుకూరల్లో ఈ ఆకు కూర అన్నింట్లోకీ ప్రత్యేకంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఈ ఒక్క ఆకుకూరతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అదే బచ్చలి కూర.
బచ్చలి కూరను చాలా తక్కువగా మాత్రమే తమ ఆహారంలో చేర్చుకుంటారు. కానీ, అత్యంత ఎక్కువగా తినాల్సిన ఆకుకూర ఇదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఒక కప్పు బచ్చలి కూరలో 145 మైక్రో గ్రాముల విటమిన్ కె వుంటుందట. అలాగే విటమిన్ ‘ఎ’ 500 మైక్రోగ్రాముల వరకూ వుంటుందట. ముఖ్యంగా కళ్లకు ఈ విటమిన్లు చాలా చాలా మంచివి. అలాగే ఐరన్ 3 మైక్రోగ్రాములుంటుంది. ఇది రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు.. విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఈ ఆకుకూరలో పుష్కలంగా లబిస్తాయ్. ఇమ్యూనిటీ లెవల్స్ని పెంచడంలో కీలకంగా సహాయపడుతుంది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







