వేసవి అంతా క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలు..!

- June 20, 2023 , by Maagulf
వేసవి అంతా క్లౌడ్-సీడింగ్ కార్యకలాపాలు..!

యూఏఈ: జూన్ నెలలో యూఏఈలో వర్షపాతం కొనసాగుతుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) వెల్లడించింది. యూఏఈలోని వివిధ ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ వర్షాలు నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ సీడింగ్ కొనసాగుతుందని ఆయన చెప్పారు.  అయితే వేసవి కాలం మొత్తం ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల వర్షాలు కురుస్తాయని, కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అది సాధ్యమ కాదన్నారు. తూర్పు ప్రాంతంపై ఉష్ణప్రసరణ మేఘాలు ఏర్పడినందున సీడ్ క్లౌడింగ్ చేపట్టినట్టు తెలిపారు. దీంతో వర్షాలు పడి వాతావరణం చల్లగా మారుతుందన్నారు. క్లౌడ్ సీడింగ్ అనేది వర్షాన్ని కురుపించే ప్రక్రియ. ఇది 1990ల చివరలో యూఏఈలో ప్రారంభమైంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com