'బ్రహ్మోత్సవం' మే 28న ప్రేక్షకుల ముందుకు..
- May 13, 2016
మహేశ్‌బాబు, కాజల్, సమంత కలయికతో తెరకెక్కిన 'బ్రహ్మోత్సవం' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అభిమానుల ఉత్కంఠకు తెరదీస్తూ ఈ చిత్రాన్ని మే నెలాఖరులోనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కథానాయికలు సమంత, కాజల్‌లు చిత్ర విశేషాలు తెలియజేశారు. 'బ్రహ్మోత్సవం' అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుందని సమంత తెలిపారు. అన్నివర్గాలను ఆకట్టుకునేలా మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కథానాయికలు పేర్కొన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు. మిక్కీ జె. మేయర్, మణిశర్మ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







