'మళ్లీ పెళ్లి.!’ ఓటీటీ తిట్లకు మేం సిద్ధం మళ్లీ.!
- June 21, 2023
నరేష్ - పవిత్రా లోకేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఇటీవల ధియేటర్లలో రిలీజై జనాలతో అడ్డగోలుగా అక్షింతలు వేయించుకున్న చిత్రమిది.
ఈ వయసులో ఇదేం వెర్రి.! అంటూ నరేష్‌ని తెగ తిట్టి పోశారీ చిత్రం చూసిన ఆడియన్స్. అక్కడికేదో స్టార్ హీరో సినిమా అన్నట్లు.. అదేదో సమాజాన్ని వుద్ధరించేసే కథ అన్నట్లుగా ఈ సినిమాని ఇక్కడా.. అక్కడా అనే తేడా లేకుండా తెగ తిరిగేసి ప్రమోట్ చేసేశారు.
భారీ బడ్జెట్ చిత్రమనీ ప్రచారం చేశారు. ప్రమోషన్ల కోసమే బోలెడంత ఖర్చు చేశారు కూడా. తీరా చూస్తే సినిమా తుస్సు. ఓపెనింగ్సూ లేవు.. రెండో రోజుకి ధియేటర్లో మాయం.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రసారం కాబోతోంది. ఈ నెల 23 నుంచి ఓటీటీ ద్వారా స్ర్టీమింగ్ కానుంది. ఒక్క ఛానెల్ కాదండోయ్. ఏకంగా ఆహా, అమెజాన్ ప్రైమ్.. రెండు ఓటీటీ ఛానెల్స్‌లో ఈ సినిమా స్ర్టీమింగ్ కాబోతోంది.
డబ్బులు పెట్టుకుని ధియేటర్‌కి వెళ్లి చూడాలంటే ఒకింత కష్టమేమో కానీ, నరేష్ రాసలీల బాగోతం హాయిగా ఫ్యాన్ వేసుకుని ఇంట్లోనే కూర్చుని చూస్తే పోయేదేముంది.? చూశాకా, ఇంకాస్త గట్టిగా తిట్టి పోసుకోవచ్చు. తిడితే తిట్టుకోండి. కానీ, మా సినిమా చూడండి.. అన్నట్లుగా వుంది మరోవైపు నరేష్ - పవిత్రల తీరు.
తాజా వార్తలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!









