H1B వీసాల రెన్యువల్‌ను సులభతరం చేయనున్న అమెరికా
- June 22, 2023
వాషింగ్టన్: హెచ్1బి వీసాలు కలిగిన భారత పౌరులకు అమెరికాలో జీవనాన్ని సులభతరం చేసేలా బైడెన్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోనుంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్1బి వీసాల రెన్యువల్‌ను సులభతరం చేయనున్నట్లు గురువారం విదేశాంగ శాఖ ప్రకటించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. దీంతో హెచ్1బి వీసాలు కలిగిన భారతీయులు, ఇతర విదేశీ ఉద్యోగులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అమెరికాలో తమ వీసాలను పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించాయి. అయితే ప్రస్తుతం కొద్దిమంది విదేశీయులకు మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నామని, రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని మరింత విస్తరించవచ్చని స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి పేర్కొన్నారు. హెచ్1బి వీసాలపై అమెరికా వెళ్లేవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. గతేడాది 4,42,000 హెచ్1బి వీసాదారుల్లో 73 శాతం భారతీయులే ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఏ వీసాదారులకు అవకాశం కల్పించనున్నారు, ఈ పథకం ఎప్పటినుండి ప్రారంభం కానుందనే ప్రశ్నలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఈ పైలెట్ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రణాళికను బ్లూమ్‌బెర్గ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల కోసం 65,000 హెచ్1 బి వీసాలను విడుదల చేసుంది. వాటితో పాటు అదనపు అర్హతలు కలిగిన కార్మికుల కోసం మరో 20,000 వీసాలను జారీ చేస్తుంది. ఈ వీసాలు మూడేళ్ల వరకు కొనసాగుతాయి. మరో మూడేళ్లకు పునరుద్ధరించబడతాయి. హెచ్1 బి వర్కర్లను భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లతో పాటు అమెజాన్, అల్ఫాబెట్, మెటా కంపెనీలు నియమించుకుంటున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్‌లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!









