దారుణంగా నష్టపోయిన ‘ఆదిపురుష్’.!

- June 22, 2023 , by Maagulf
దారుణంగా నష్టపోయిన ‘ఆదిపురుష్’.!

ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కి, దారుణంగా విమర్శల పాలైన సినిమా ‘ఆదిపురుష్’. ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని డైరెక్ట్‌గా తెలుస్తున్నప్పటికీ చిత్ర యూనిట్, ట్రేడ్ వర్గాలు మాత్రం 300 కోట్లు, 400 కోట్ల వసూళ్లు.. అంటూ అనౌన్స్‌మెంట్లు రిలీజ్ చేస్తున్నారు.
కానీ, అంత సీనూ సినిమా లేదు ‘ఆది పురుష్’‌కి. అందుకు పూర్తి భిన్నంగా వుంది పరిస్థితి. వసూళ్లు దారుణంగా పడిపోయాయ్. నార్త్‌లో కొంతవరకూ బెటర్. తక్కువ నష్టాలతోనే బయటపడొచ్చునంటున్నారు. కానీ, సౌత్ పరిస్థితి ఘోరంగా వుంది.  
ఏదో పబ్లిసిటీతో అలా నెట్టుకొచ్చేస్తున్నారు. కానీ, నిర్మాతలు చెప్పుకోలేక, విప్పుకోలేక అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వరుసగా ప్రబాస్ నుంచి ఇది మూడో సినిమా ఇలా నష్టాల్లో మునిగిపోవడం. దాంతో, ప్రబాస్ ఇమేజ్‌కి బాగా డ్యామేజ్ ఏర్పడిపోయింది. ఈ డ్యామేజ్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ప్రబాస్ వున్నాడట. 
అన్నట్లు వీకెండ్ స్పెషల్‌గా ‘ఆదిపురుష్’ సినిమా టిక్కెట్ల రేట్లను కూడా తగ్గించేశారట. అయినా ఈ సినిమాపై ఎవ్వరూ ఆసక్తి చూపించకపోవడం విశేషం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com