2022లో యూఏఈ జీడీపీ 7.9 శాతం

- June 26, 2023 , by Maagulf
2022లో యూఏఈ జీడీపీ 7.9 శాతం

యూఏఈ: ఫెడరల్ కాంపిటీటివ్‌నెస్ అండ్ స్టాటిస్టిక్స్ సెంటర్ (FCSC) విడుదల చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం, యూఏఈ జీడీపీ 2022లో స్థిరమైన ధరల వద్ద 7.9 శాతం వృద్ధి చెంది Dh1.62 ట్రిలియన్లకు చేరుకుంది. 2022లో మునుపటి సంవత్సరంతో పోలిస్తే Dh337 బిలియన్ల కంటే ఎక్కువ పెరుగుదల(22.1 శాతం వృద్ధి) సాధించింది. FCSC గణాంకాలు జూన్‌లో విడుదల చేసిన తాజా 'గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్'లో యూఏఈ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రపంచ బ్యాంక్ అంచనా వేసిన 7.9 శాతం వృద్ధికి అనుగుణంగా ఉన్నది. మహమ్మారి సమయంలో యూఏఈ ప్రభుత్వం అనుసరించిన వ్యాపార అనుకూల విధానాలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయడంతో ఈ వృద్ధి సాధ్యమైందని నివేదిక తెలిపింది. ముఖ్యంగా ట్రావెల్ అండ్ టూరిజం, రియల్ ఎస్టేట్, విమానయానం, వాణిజ్యం గత రెండేళ్లలో యూఏఈ ఆర్థిక పునరుద్ధరణకు దారితీసిందని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com