అరాఫత్ రోజున ఉపవాసంతో ఈద్ అల్ అదా వేడుకలు ప్రారంభం

- June 26, 2023 , by Maagulf
అరాఫత్ రోజున ఉపవాసంతో ఈద్ అల్ అదా వేడుకలు ప్రారంభం

యూఏఈ: యూఏఈతోపాటు ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలోని ముస్లింలు జూన్ 27 ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడే అరాఫత్ రోజున ఉపవాసంతో ఈద్ అల్ అదా వేడుకలను ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం, సౌదీ అరేబియాలో ఈద్ అల్ అదా సందర్భంగా మిలియన్ల మంది ముస్లింలు హజ్ (తీర్థయాత్ర) చేస్తారు. ఈ సంవత్సరం  160 దేశాల నుండి రెండు మిలియన్లకు పైగా ఆరాధకులు మహ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవడానికి,  ప్రవక్తలు ఇబ్రహీం, ఇస్మాయిల్ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిన అనుభవాన్ని పొందనున్నారు.  మంగళవారం నుండి  నివాసితులు శుక్రవారం వరకు నాలుగు రోజుల ఈద్ అల్ అదా సెలవులను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com