ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ..
- May 13, 2016
సభ్యులుగా ద్రవిడ్, రవిశాస్త్రి దుబాయ్: ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. 2012లో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. తాజా నియామకంతో మరో మూడేళ్ల పాటు (2018 వరకు) ప్యానెల్ కు చీఫ్‌గా వ్యవహరించనున్నారు. ఇక కమిటీలో సభ్యులుగా రాహుల్ ద్రవిడ్‌కు చోటు లభించింది. తాజా ఆటగాళ్ల ప్రతినిధిగా ద్రవిడ్‌తో పాటు ఆసీస్ మాజీ స్పిన్నర్ టిమ్ మే నియామకం జరిగింది.మాజీ ఆటగాళ్ల ప్రతినిధిగా శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్ధనే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ను నియమించారు. వీరంతా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మీడియా ప్రతినిధిగా కామెంటేటర్ రవిశాస్త్రి, అంపైర్ల ప్రతినిధిగా రిచర్డ్ కెటిల్‌బరో... ఎక్స్ అఫీషియో చైర్మన్లుగా శశాంక్ మనోహర్, డేవ్ రిచర్డ్సన్ వ్యవహరిస్తారు. ఈనెల 31, జూన్ 1న లార్డ్స్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో కమిటీ తొలి సమావేశం జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







