‘స్పై’ ప్రమోషన్లలో నిఖిల్ బిజీ బిజీ.! ఈ సారి కూడా.!
- June 26, 2023
‘కార్తికేయ 2’ సినిమాతో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతవరకూ నిఖిల్ అంటే ఎవ్వరో తెలియని నార్త్ ప్రేక్షకులు నిఖిల్‌ని ఓన్ చేసేసుకున్నారు.
తెలుగుతో పోల్చితే, బాలీవుడ్లో ఈ సినిమాకి విపరీతమైన ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ 2’ తర్వాత బాలీవుడ్లో నిఖిల్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమా ‘స్సై’. ఈ సినిమాకి ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు.
ప్రస్తుతం బెంగుళూరులో ప్రమోషన్ల కోసం వెళ్లిన నిఖిల్‌కి అపురూపమైన ఆదరణ లభిస్తోంది అక్కడి అభిమానుల నుంచి. జూన్ 29న వరల్డ్ వైడ్‌గా పలు భాషల్లో రిలీజ్ అవుతోన్న ‘స్పై’ సినిమాపై అంచనాలు బాగున్నాయ్.
యూనిక్ సబ్జెక్ట్ కావడం, నేతాజీ డెత్ మిస్టరీని చేధించే కాన్సెప్ట్‌తో అదిరిపోయే యాక్షన్ సీన్స్ తెరకెక్కించడంతో ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇంతవరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
చూడాలి మరి, ‘కార్తికేయ 2’ మాదిరి ‘స్సై’ సినిమాని ప్రేక్షకులు అదే తరహాలో ఆదరిస్తారో లేదో.!
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







