శంకర్ ఆ సాహసం చేస్తాడా.?
- June 27, 2023
డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఓ ప్రత్యేకత వుంటుంది. ఆయన మేకింగ్ స్టైల్.. స్టోరీ కలెక్షన్స్ డిఫరెంట్ వేలో వుంటాయ్. అలాగే, సినిమాని వెండితెరపై ఆవిష్కరించడంలోనూ శంకర్ రూటే సెపరేటు. అందుకే ఆయన సినిమాలకంత క్రేజ్.
ప్రస్తుతం ఆయన విశ్వనటుడు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా గురించి తాజాగా ఓ గాసిప్ ప్రచారంలో వుంది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడనేదే ఆ గాసిప్ సారాంశం.
ఆ గెస్ట్ రోల్ చాలా చాలా సర్ప్రైజింగ్గా వుండబోతోందనీ గుసగుస. అయితే, శంకర్ అలాంటి సాహసాలకు చాలా దూరంగా వుంటాడు. ఒకవేళ అలాంటిదేమైనా వుండి వుంటే, ఈ పాటికే హింట్ ఇచ్చేసి వుండేవాడు శంకర్.
అయితే, నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఒకవేళ జరుగుతున్న గాసిప్ నిజమే అయితే, ఆ గెస్ట్ ఎవరన్న అంశం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా వుంది. ఈ ప్రచారానికి వచ్చిన క్రేజ్‌ని బట్టి, ఒకవేళ గెస్ట్ రోల్ క్రియేట్ చేయాల్సన పరిస్థితి వచ్చినా రావచ్చు శంకర్‌కి.
అదే అరిగితే, ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి, బాలీవుడ్ నుంచి ఆ ప్రముఖ హీరో స్పెషల్ అప్పియరెన్స్ వుండొచ్చు అనేది ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- కెనడాలో భారతీయ సినిమాల పై దాడులు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు