ఆ ట్రక్కులో అత్యంత మండే పెట్రోలియం పదార్థాలు

- June 29, 2023 , by Maagulf
ఆ ట్రక్కులో అత్యంత మండే పెట్రోలియం పదార్థాలు

కువైట్: నిన్న గజాలి వీధిలో ట్రక్కులో మంటలు చెలరేగడం ఉద్దేశపూర్వక చర్య కాదని, ఇంజిన్ ఆయిల్ లీకేజీ, ఇంజిన్ వేడి కారణంగా సంభవించిందని జనరల్ ఫైర్ ఫోర్స్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా విభాగం పేర్కొంది. ట్రక్కులో అత్యంత మండే పెట్రోలియం పదార్థాలు ఉన్న రెండు కంటైనర్లు ఉన్నాయని చెప్పింది. కంటైనర్ల నుంచి నిపుణులు నమూనాలను సేకరించి విశ్లేషించారు. అందులో కిరోసిన్ రసాయన కూర్పును కలిగి ఉన్న అత్యంత మండే పెట్రోలియం పదార్థాన్ని గుర్తించారు. అది ఆ కంటైనర్ల కస్టమ్స్ డిక్లరేషన్‌లో పేర్కొన్న దానికి అనుగుణంగా ఉంది. నివేదిక ప్రకారం, ట్రక్కును ఎగుమతి, దిగుమతి చేసుకునే హక్కు ఉన్న కువైట్ కంపెనీ అద్దెకు తీసుకుంది. అది ఎగుమతి కోసం షువైఖ్ పోర్ట్‌కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుందని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com