సైబర్‌ క్రైమ్‌తో తస్మాత్‌ జాగ్రత్త

- May 13, 2016 , by Maagulf
సైబర్‌ క్రైమ్‌తో తస్మాత్‌ జాగ్రత్త

దుబాయ్‌ విమెన్స్‌ అసోసియేషన్‌ సహకారంతో దుబాయ్‌ పోలీస్‌, ఎటిసలాట్‌తో అల్‌ అమీన్‌ సర్వీస్‌ సంయుక్తంగా నిర్వహించిన అవేర్‌నెస్‌ కార్యక్రమంలో 'పెరుగుతున్న బ్లాక్‌మెయిలింగ్‌' కేసుల పట్ల పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్‌ క్రైమ్స్‌, బ్లాక్‌మెయిలింగ్‌ కేసులు, అలాగే యూఏఈ చట్టాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సోషల్‌ మీడియా దుష్ప్రభావాలపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చ జరిగింది. మహిళలు, పిల్లలు సోషల్‌ మీడియా కారణంగా బాధితులవుతున్నారనీ, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం లేదా ఫొటోలను పంపించడం ప్రమాదకరమని ఇంజనీర్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ జరౌని చెప్పారు. మ్యారేజ్‌ బ్యూరో పేరుతో ఉండే వెబ్‌సైట్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 2013లో అల్‌ అమీన్‌ 80 బ్లాక్‌మెయిల్‌ కేసులను ఎదుర్కొందని, 2012లో వీటి సంఖ్య 212గా ఉందని, ఓ వ్యక్తి 60 మంది పిల్లల్ని బ్లాక్‌మెయిల్‌ చేసి, వారికి చెందిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడం ద్వారా అందులో చాలామంది పిల్లలు ఆత్మహత్యాత్నం చేశారని ఖలీల్‌ అల్‌ అలి చెప్పారు. ఈ సంఘటన వేరే దేశంలో జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com