దుబాయ్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌కి వినియోగదారుల విద్యుత్
- May 13, 2016
తమ భవనాలపై సోలార్ ప్యానెల్స్‌ని ఇన్స్టాల్ చేసి, వాటి ద్వారా విద్యుత్‌ని ఖర్చు లేకుండా పొందుతున్న వినియోగదారులు, తాము వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దెవా) గ్రిడ్‌కి అనుసంధానిస్తున్నారు. మొత్తం 30 ఫొటోవాల్టాయిక్ సిస్టమ్స్ ఇన్స్టాల్ కాగా, అందులో ఆరు సిస్టమ్స్ దుబాయ్ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్కి కనెక్ట్ చెయ్యబడ్డాయి. షామ్స్ దుబాయ్ ఇనీషియేటివ్ పేరుతో గత ఏడాది మార్చ్‌లో ఇచ్చిన పిలుపు మేరకు ఈ అద్భుతం చోటుచేసుకుంది. సౌర విద్యుత్ వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, అలాగే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ విద్యుత్ వినియోగం తగ్గించగలిగామని అధికారులు చెప్పారు. 18 ప్రభుత్వ సంస్థలతో 37 ప్రాజెక్టులను 279 కిలోవాట్స్ కెపాసిటీతో చేపట్టి, వాటి ద్వారా ఏడాదికి 445 మిలియన్ వాట్స్ కరెంట్‌ని ఉత్పత్తి చేయగలుగుతోంది దెవా. 2050 నాటికి క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ ఎకానమీ విభాగంలో దుబాయ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా షామ్స్ దుబాయ్ ప్రోగ్రామ్ ద్వారా చేయస్తామని దెవా సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సయీద్ మొహమ్మద్ అల్ తయార్ చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







