ICBF లేబర్ క్యాంపులలో ఈద్ వేడుకలు
- July 03, 2023
దోహా: పారిశ్రామిక ప్రాంతంలోని లేబర్ క్యాంపులలో నివసించే కార్మికులతో ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) ఈద్‌ను జరుపుకుంది. స్ట్రీట్ నంబర్ 13లోని లేబర్ క్యాంప్‌లో అల్పాహారంతో పండుగ ప్రారంభమైంది. స్ట్రీట్ నంబర్ 36లోని మరో క్యాంపులో మధ్యాహ్న భోజన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిబిఎఫ్ ప్రెసిడెంట్ షానవాస్ బావ, వైస్ ప్రెసిడెంట్ దీపక్ శెట్టి, జనరల్ సెక్రటరీ వర్కీ బోబన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు శంకర్ గౌడ్, కుల్వీందర్ సింగ్ కార్మికులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సహకారం అందించిన RJ అప్పుణ్ణి నేతృత్వంలోని రేడియో సునో బృందానికి కృతజ్ఞతలు ICBF తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ
- యూఏఈ ప్రయాణికుల పై ఇండిగో రద్దు ప్రభావమెంత?
- ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం?
- అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!
- మస్కట్ లో ‘ది లైఫ్‌స్పాన్ 2025’ ప్రారంభం..!!
- సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- పెద్ద పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం
- RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..
- క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!







