విజయవాడ–చెన్నై నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్
- July 03, 2023
అమరావతి: ఏపి రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి వందేభారత్ రైలు రాకపోకలు మొదలు కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐదు వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో విజయవాడ- చెన్నై మధ్య నడిచే రైలు ఒకటి. ఈ నెల 8 నుంచి రైలు సర్వీసులు పూర్తి స్థాయిలో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగుతుంది, రాకపోకల షెడ్యూల్, టికెట్ ధరలు తదితర వివరాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. విజయవాడ-రేణిగుంట మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట మీదుగా రైలును నడపాలని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు కోరినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
- అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- తిరుమలలో కీలక మార్పులు...
- పుతిన్కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ
- యూఏఈ ప్రయాణికుల పై ఇండిగో రద్దు ప్రభావమెంత?
- ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం?
- అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!
- మస్కట్ లో ‘ది లైఫ్స్పాన్ 2025’ ప్రారంభం..!!
- సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!







