భద్రతా సిబ్బందిపై కాల్పులు. నిందితులు అరెస్ట్
- July 03, 2023
సౌదీ: అల్-కున్‌ఫుదా గవర్నరేట్‌లో యాంఫెటమైన్ డ్రగ్ విక్రయాలు జరుపుతున్నారని సమాచారం మేరకు దాడులు చేసిన భద్రతా సిబ్బందిపై నిందితులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామని, వారి వద్ద ఉన్న మారణాయుధాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని కాంపిటెంట్ అథారిటీకి రిఫర్ చేశామన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా ప్రమోషన్‌కు సంబంధించిన ఏదైనా కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని భద్రతా అధికారులు సౌదీ పౌరులందరికీ, అలాగే నివాసితులను కోరారు. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో 911 నంబర్‌లను సంప్రదించడం ద్వారా ఈ నేరాలను నివేదించవచ్చని, మిగిలిన ప్రాంతాలలో 999 ద్వారా కాల్ చేయాలన్నారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!