స్వీడన్‌ ఘటనను తీవ్రంగా ఖండించిన సౌదీ

- July 03, 2023 , by Maagulf
స్వీడన్‌ ఘటనను తీవ్రంగా ఖండించిన సౌదీ

జెడ్డా: స్వీడన్‌లో పవిత్ర ఖురాన్‌ను కాల్చడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఇలాంటి రెచ్చగొట్టే విధానాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం గట్టిగా నిలబడాలని, అలాగే అవి పునరావృతం కాకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరింది. ఖురాన్ దహనం గురించి చర్చించడానికి ఆదివారం OIC ప్రధాన కార్యాలయంలో OIC ఎగ్జిక్యూటివ్ కమిటీ అత్యవసర బహిరంగ సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా ఇస్లామిక్ సహకార సంస్థ (OIC) కు సౌదీ అరేబియా శాశ్వత ప్రతినిధి డాక్టర్ సలేహ్ అల్-సుహైబానీ ఈ మేరకు పిలుపునిచ్చారు.  సెషన్‌కు అధ్యక్షత వహించిన డాక్టర్ అల్-సుహైబానీ ఈద్ అల్-అదా మొదటి రోజు బుధవారం జరిగిన చర్యను తీవ్రంగా ఖండించారు.  ఖురాన్ దహనం ఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు 57 ముస్లిం దేశాలను సమూహపరిచిన పాన్ ఇస్లామిక్ సంస్థ ప్రస్తుత చైర్‌గా ఉన్న సౌదీ అరేబియా అభ్యర్థన మేరకు OIC సమావేశం ఏర్పాటు చేయబడింది.ఈ సంఘటన ప్రజల మధ్య పరస్పర గౌరవాన్ని, సహనాన్ని పెంచే ప్రపంచ ప్రయత్నాలను బలహీనపరుస్తుందని ఓఐసి సెక్రటరీ జనరల్ హిస్సేన్ బ్రహిం తాహా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సభ్యదేశాలు ఏకం కావాలని, సమిష్టి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com