ప్రియమణితో సినిమా అంటే షరతులు వర్తిస్తాయ్.!
- July 03, 2023
‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియమణి. తర్వాత ‘యమదొంగ’ తదితర సినిమాలతో పాపులర్ అయ్యింది. ఎన్టీయార్‌తో పాటూ నాగార్జున తదితర స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.
ప్రస్తుతం పెళ్లి చేసుకుని కూడా కెరీర్‌ని కొనసాగిస్తోంది. హీరోయిన్గా అవకాశాలు రాకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలైపోయింది.
లేటెస్ట్గా ‘కస్టడీ’ సినిమాలో నటించింది. అలాగే, పలు సినిమాల్లో ప్రత్యేకమైన హుందా అయిన పాత్రలను ప్రియమణి ఎంచుకుంటోంది.
మరోవైపు ఓటీటీలో వెబ్ సిరీస్‌లలోనూ తన టాలెంట్ చూపిస్తోంది. అయితే, వెబ్ కంటెంట్ అంటే, కొన్ని ఇంటిమేట్ సీన్లు, ముద్దు సీన్లు తప్పనిసరి అయిపోయాయ్. కానీ, అలాంటి సీన్లకు తాను దేూరం అంటోంది ప్రియమణి.
పెళ్లి తర్వాత అలాంటి సన్నివేశాల్లో నటించడం తనకు అంత కంఫర్ట్ కాదని చెబుతోంది. సో, ప్రాజెక్ట్ సైన్ చేసేముందే దర్శక, నిర్మాతలకు ఆ షరతులు పెట్టేస్తుందట. అలాంటి షరతుల కారణంగా చాలా బిగ్ ప్రాజెక్టులు వదులు కోవల్సి వచ్చిందట ఈ మధ్య ప్రియమణి. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కొన్ని ప్రాజెక్టుల్ని సింపుల్‌గా వదిలేసుకున్నానంటూ తాజాగా ఓ ఇంటర్య్యూలో ప్రియమణి చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!