యూఏఈలో సమ్మర్ సేల్స్: డిస్కౌంట్‌లు, ప్రమోషన్‌లు

- July 05, 2023 , by Maagulf
యూఏఈలో సమ్మర్ సేల్స్: డిస్కౌంట్‌లు, ప్రమోషన్‌లు

యూఏఈ: దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్, షార్జా సమ్మర్ ప్రమోషన్‌ల మెగా షాపింగ్ అమ్మకాలతో వేసవి సీజన్ నివాసితులు, సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ విక్రయాలు నమ్మశక్యం కాని తగ్గింపులను అందిస్తున్నాయి. కస్టమర్లు ఈ సమయాల్లో తమ కొనుగోళ్లపై 75 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. హ్యాండ్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి తగ్గింపులు, విక్రయాలను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కొత్త ఫర్నిచర్, గృహ ఉపకరణాల కోనుగోళ్లలో భారీ తగ్గింపులను పొందడంతోపాటు క్యాష్ బ్యాక్ ఆపర్లను దుకాణందారులు అందిస్తున్నారు. షార్జా సమ్మర్ ప్రమోషన్‌లు 2023, జూలై 1న ప్రారంభమై 65 రోజుల పాటు కొనసాగుతుంది. 75 శాతం వరకు మెగా తగ్గింపులు,  Dh100,000 విలువైన వోచర్‌లతో పాటు హోటల్ ప్యాకేజీలు, టూరిస్ట్ ప్యాకేజీలు మరియు సరికొత్త నిస్సాన్ కోసం గ్రాండ్ డ్రాను అందిస్తుంది.  ఇదేవిధంగా, జూన్ 29 నుండి సెప్టెంబర్ 3 వరకు కొనసాగనున్న దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్ (DSS) 26వ ఎడిషన్ షాపింగ్ డీల్స్, ప్రమోషన్‌లు మరియు ఫ్రీబీలతో తిరిగి వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com