నేషనల్ కెరీర్ గైడెన్స్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- July 06, 2023
మస్కట్: నేషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ (NEP) "ఖుతా" ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. ఇది ఒమన్ సుల్తానేట్‌లో కెరీర్ గైడెన్స్ కోసం మొదటి జాతీయ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్. ఇది విద్య, శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణ, కార్మిక మార్కెట్ మరియు ఉపాధి రంగాలలో ఒమన్ విజన్ 2040 యొక్క వ్యూహాలకు అనుగుణంగా పనిచేయనుంది. ఈ వేడుకను ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్ హెడ్ హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఖమీస్ బిన్ సైఫ్ అల్ జబ్రీ స్పాన్సర్ చేశారు. "ఖుతా" ప్లాట్‌ఫారమ్ పాఠశాల, ఉన్నత విద్యలోని విద్యార్థులు, ఉద్యోగార్ధులు, ఉద్యోగులు, స్వయం-యజమానులు, వ్యవస్థాపకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలను లక్ష్యంగా పనిచేస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్లా బిన్ ఖమీస్ అంబుసైది వివరించారు. కేవలం ఉద్యోగావకాశాలకే పరిమితం కాకుండా ఉద్యోగార్థులు, పాఠశాల విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టేందుకు శిక్షణ కోర్సులను అందజేస్తుందన్నారు. విద్యార్థులను వృత్తులు, శిక్షణా కోర్సుల వైపు మళ్లించడంలో కెరీర్ గైడెన్స్ స్పెషలిస్ట్ పాత్ర ద్వారా ఈ వేదిక విద్యా మంత్రిత్వ శాఖ పనిని పూర్తి చేస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి









