యాత్ర 2 మోషన్ పోస్టర్ విడుదల...
- July 08, 2023
హైదరాబాద్: ఎన్నికల సమయంలో మలయాళ హీరో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ చిత్రం మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కింది. మహీ వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కథ ఆధారంగా సీక్వెల్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
ఒక నిమిషం పాటు ఉన్న ఈ మోషన్ పోస్టర్ వీడియోలో.. యానిమేటెడ్ జగన్ నడుస్తూ ఉంటే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వస్తుంటుంది. “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నేను విన్నాను నేను ఉన్నాను” అంటూ జగన్ వాయిస్ ఓవర్ వచ్చింది. ఇక ఈ సినిమాకి ప్రాజెక్ట్ K కి సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. మోషన్ పోస్టర్ గ్లింప్స్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కాగా ఈ చిత్రాన్ని V సెల్యులాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
2024 ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తామంటూ మూవీ టీం అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమాలో జగన్ పాత్రని ఎవరు పోషిస్తున్నారు అనే దాని పై ఇంకా సస్పెన్స్ నెలకుంది. తమిళ్ హీరో జీవా పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘జగన్ పాదయాత్ర దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయ్యి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పూర్తి అవుతుందని’ ఇప్పటికే దర్శకుడు తెలియజేశాడు.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









