పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

- July 11, 2023 , by Maagulf
పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

యూఏఈ: ఉమ్ అల్ క్వైన్‌లోని ఓ పెర్ఫ్యూమ్ ప్లాంట్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు ఎమిరేట్స్‌కు చెందిన సివిల్ డిఫెన్స్ బలగాలు మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగాయి. రస్ అల్ ఖైమా, అజ్మాన్ మరియు షార్జాలోని పౌర రక్షణ విభాగాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఉమ్ అల్ క్వైన్ సివిల్ డిఫెన్స్ బృందంతో కలిసి  సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఉమ్ అల్ ఖువైన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ రషీద్ బిన్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మాట్లాడుతూ.. రస్ అల్ ఖైమా, అజ్మాన్ మరియు షార్జాలోని పౌర రక్షణ శాఖల వేగవంతమైన ప్రతిస్పందనను ప్రశంసించారు. మానవ ప్రాణనష్టం జరగకుండా మంటలను అదుపులోకి తెచ్చారని కొనయాడారు. ఉమ్ అల్ ఖైవైన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా,  డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ సలేం హమద్ బిన్ హమ్దాతో కలిసి ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. ఉమ్ అల్ ఖైవైన్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అజ్మాన్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ ఖలీద్ అల్ షమ్సీ కూడా వారితో ఉన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com