నిర్దేశించని ప్రాంతాలలో రోడ్డు దాటితే 400 దిర్హామ్ జరిమానా

- July 11, 2023 , by Maagulf
నిర్దేశించని ప్రాంతాలలో రోడ్డు దాటితే 400 దిర్హామ్ జరిమానా

యూఏఈ: పాదచారుల ఉల్లంఘన గురించి షార్జా పోలీసులు సోషల్ మీడియాలో వార్నింగ్ రిమైండర్ జారీ చేశారు.  నిర్దేశించని ప్రాంతాలలో రోడ్లు దాటడం వల్ల 400 దిర్హామ్ జరిమానా విధించబడుతుందని అందులో హెచ్చరించారు. ఈ ఉల్లంఘన ప్రమాదాలకు, ప్రాణనష్టానికి కూడా దారి తీస్తుందని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో 34 ఏళ్ల ఆసియా వ్యక్తి పాదచారుల క్రాసింగ్ కోసం అనుమతి లేని స్థలం నుండి రోడ్డు దాటుతున్నప్పుడు రెండు వేర్వేరు వాహనాలు ఢీకొని మరణించాడు. బాధితుడు రోడ్డుకు అడ్డంగా సైకిల్‌పై వెళుతుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.  

ఇతర ఎమిరేట్‌లకు చెందిన పోలీసులు కూడా రోడ్డుపై ప్రమాదాలకు దారితీసే ఉల్లంఘనల గురించి, అలాగే వారు మీకు విధించే జరిమానాలు, బ్లాక్ పాయింట్‌ల గురించి పదేపదే రిమైండర్‌లను జారీ చేస్తున్నారు. గత వారమే దుబాయ్‌లో ట్రాఫిక్ చట్టానికి చేసిన సవరణలు అమలులోకి వచ్చాయి. వాటిలో 100,000 వరకు జరిమానాలు ఉన్నాయి. రహదారులపై భద్రతను పెంచేందుకు, మరణాలను తగ్గించేందుకు కొత్త జరిమానాలను అమలు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com