ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన స్కామింగ్ మెసేజ్‌లు

- July 11, 2023 , by Maagulf
ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన స్కామింగ్ మెసేజ్‌లు

కువైట్: ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన స్కామింగ్ మెసేజ్‌ల సమస్య ఇటీవల బాగా పెరిగింది. దీంతో కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. పంపిన లింక్ ద్వారా ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని ప్రజలను కోరుతూ స్కామర్లు పంపిన SMS సందేశాలు పంపుతున్నారని, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహారించాలని హెచ్చరించింది. ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు చెల్లించకుంటే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని బెదిరించే సందేశాలు తాము పంపమని గమనించాలని కోరింది. ఇవి ప్రజలను మోసం చేయడానికి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను క్లోనింగ్ చేసే వెబ్‌సైట్‌ను ఉపయోగించే స్కామింగ్ కార్యకలాపాలు, మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇది ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫారమ్, సహెల్ అప్లికేషన్‌లో ఉల్లంఘించిన వారికి మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనల హెచ్చరిక సందేశాలను పంపుతుందని పేర్కొంది. ఏదైనా చెల్లింపు ఆపరేషన్‌కు ముందు వారు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలని ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com