‘భోళా శంకర్’.! జామ్ జామ్ జజ్జనక.! అదిరేలా మెగాస్టార్ తయ్య తక.!
- July 12, 2023
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. ఆగస్ట్ 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. టీజర్‌తో మెగా ఫ్యాన్స్‌కి కిర్రాకెత్తించిన చిరంజీవి తాజాగా ఫస్ట్ సింగిల్‌తో పూనకాలు తెప్పించారు.
‘జామ్ జామ్ జజ్జనక..’ అంటూ సాగే పార్టీ సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులకు ఎంతటి వారైనా ఫిదా కావల్సిందే. ఓ వైపు కీర్తి సురేష్, మరోవైపు తమన్నా.. చుట్టూ బోలెడంత మంది డాన్సర్స్‌తో మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు ఇరగదీస్తున్నారు.
సాంగ్ మధ్యలో ‘నర్సపెల్లే..’ మాస్ బీట్ అయితే, ఇక కేక పుట్టిస్తోంది. మెగా ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది ఈ సాంగ్. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఆకట్టుకునే మ్యూజిక్ ఇచ్చినట్లుగా ఈ సెలబ్రేషన్ సాంగ్ చూస్తే అర్ధమవుతోంది. ‘వాల్తేర్ వీరయ్య’తో సూపర్ హిట్ కొట్టి హుషారు మీదున్న చిరంజీవి, ‘భోళా శంకర్’తో ఎలాంటి రికార్డులు కొల్లగొడతారో చూడాలి మరి.
తాజా వార్తలు
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్‌లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్‌లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్‌పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ









