ఎయిర్ ఇండియా విమానంలో వ్యక్తి అనుచిత ప్రవర్తన.. కేసు నమోదు
- July 13, 2023
యూఏఈ: టొరంటో నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో క్యాబిన్ సిబ్బందిని దుర్భాషలాడడం, లోపల ఉన్న లావేటరీ తలుపును పగలగొట్టినందుకు నేపాల్ జాతీయుడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం, నేపాల్ నివాసి మహేష్ సింగ్ పండిట్ అనే ప్రయాణికుడు తన సీటును 26E నుండి 26F కి మార్చుకున్నాడని, ఈ క్రమంలో ఎకానమీ క్లాస్ సిబ్బందిని దుర్భాషలాడడం ప్రారంభించాడని క్యాబిన్ సూపర్వైజర్ ఆదిత్య కుమార్ తెలిపారు. మరో 10 మంది ప్రయాణికుల సహాయంతో నిందితుడైన ప్రయాణికుడిని అదుపు చేయగలిగామని క్యాబిన్ సూపర్వైజర్ తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు. స్మోక్ అలారం రావడంతో అప్రమత్తమయ్యామని, లావెటరీ నుంచి పొగ రావడం గమనించి వెళ్లేలోగా సదరు నిందితుడు మమ్మల్ని తోసుకుంటూ.. దురుసుగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడడని, అనంతరం ప్రయాణికుల సాయంతో నిలువరించినట్లు తన ఫిర్యాదులో కుమార్ పేర్కొన్నాడు. ఢిల్లీ పోలీసులు ఐజీఐ పోలీస్ స్టేషన్లో సెక్షన్లు 323/506/336 ఇండియన్ పీనల్ కోడ్, 22,23,25 ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







