ఈ వేసవిలో మొదటిసారిగా యూఏఈలో 50°C దాటిన ఉష్ణోగ్రత
- July 16, 2023
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది ప్రజలు ప్రమాదకరమైన అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ ప్రకారం.. యూఏఈలో ఉష్ణోగ్రతలు ఈ వేసవిలో మొదటిసారిగా శనివారం 50ºC మార్కును దాటాయి. జూలై 15న అబుధాబిలో మధ్యాహ్నం 2.30 గంటలకు బడా దఫాస్ (అల్ దఫ్రా ప్రాంతం)లో దేశంలో అత్యధికంగా 50.1°C నమోదైంది. ఇటీవల, యూఏఈ ప్రకటించినట్లుగా పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం, ఒక మోస్తరు గాలులతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం అబుధాబి మరియు దుబాయ్ రెండింటిలోనూ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి. ఎమిరేట్స్‌లో వరుసగా 34°C , 35°C కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూఏఈలోని వైద్యులు అత్యధిక వేడి సమయంలో ఇంటి లోపలనే ఉండాలని, నేరుగా సూర్యరశ్మిని నివారించాలని నివాసితులకు సూచించారు. ఎలక్ట్రోలైట్ల నష్టాన్ని నివారించడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం కీలకమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. యూఏఈ 'మిడ్డే బ్రేక్' కార్యక్రమం జూన్ 15 నుండి అమలులోకి వచ్చింది. ఇది బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రత్యక్ష సూర్యకాంతిలో మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటల వరకు పని చేయడాన్ని నిషేధిస్తుంది. దీనిని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) వరుసగా 19వ సంవత్సరం అమలు చేసింది.నిబంధనలు పాటించని యజమానులకు ప్రతి కార్మికుడికి 5,000 దిర్హామ్‌లు జరిమానా విధించబడుతుంది. నిషేధిత సమయాల్లో అనేక మంది కార్మికులు పని చేసినపుడు గరిష్ట జరిమానా మొత్తం Dh50,000గా నిర్ణయించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







