కృతి సనన్ ఖాతాలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్.?
- July 19, 2023
‘వన్ - నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. మొదటి ఇన్నింగ్స్‌లో కృతి సనన్‌కి పెద్దగా కలిసి రాలేదు తెలుగులో. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ ‘మిమి’ సినిమా క్లిక్ అవ్వడంతో, కృతి సనన్ కెరీర్ టర్న్ అయ్యింది.
ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా బాలీవుడ్లో చెలామణీ అవుతున్న కృతి సనన్ ఇటీవల ‘ఆది పురుష్’ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. సినిమా హిట్ అయ్యుంటే వేరే లెవల్లో వుండేది. కానీ, అలా జరగలేదు. సో, సెకండ్ ఇన్నింగ్స్ కూడా కృతి సనన్‌కి బెడిసి కొట్టింది.
కానీ, ఆమె స్టార్డమ్ మాత్రం అలాగే వుందండోయ్. బాలీవుడ్లో ప్రెస్టీజియస్ మూవీస్ కృతి సనన్ కోసం క్యూ కడుతున్నాయ్. ఈ నేపథ్యంలోనే ఆమె చేతిలో పలు ప్రాజెక్టులుండగా, తాజాగా ఓ బయోపిక్ వచ్చి చేరింది.
దివంగత బాలీవుడ్ నటి మీనా కుమారి బయోపిక్‌లో కృతి సనన్ నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఫ్యాషన్ డిజైనర్ మనీస్ మల్హోత్రా డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
‘పాకీజా’, ‘జైబు బావ్రా’, ‘పూల్ ఔర్ పత్తర్’ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మీనా కుమారి జీవితం ఓ ట్రాజెడీ స్టోరీ. ఇంత బరువైన పాత్రను కృతి సనన్ ఎలా రక్తి కట్టిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం