ప్రపంచ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో మెరుగైన ఒమన్

- July 19, 2023 , by Maagulf
ప్రపంచ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో మెరుగైన ఒమన్

మస్కట్: తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఒమన్ ర్యాంకు మెరుగైంది. గత ఏడాది ర్యాంకింగ్స్ నుండి ఎనిమిది స్థానాలు ఎగబాకి ప్రపంచంలో 60వ స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్‌లను నిర్వహించిన హెన్లీ & పార్ట్‌నర్స్ ప్రకారం.. ఒమన్ ఇప్పుడు 85 దేశాలకు యాక్సెస్‌ను కలిగి ఉంది. 2022 కంటే నాలుగు దేశాలు పెరిగాయి. సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ను కలిగి ఉందని హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ పేర్కొంది. సింగపూర్ పౌరులు ప్రపంచంలోని 227 వీసా-రహిత ప్రదేశాలలో 193 గమ్యస్థానాలను సందర్శించవచ్చు. ఐదేళ్ల తర్వాత జపాన్ 3వ స్థానానికి పడిపోయింది.

ఒమన్ పొరుగున ఉన్న యూఏఈ గత సంవత్సరం కంటే మూడు స్థానాలు ఎగబాకి 12వ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. ఎమిరాటీ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నవారు ఇప్పుడు వీసా లేకుండా 179 గమ్యస్థానాలను సందర్శించవచ్చు. గత 10 సంవత్సరాలలో, ఒమన్ పాస్‌పోర్ట్ 2013లో 65 నుండి 60కి ఐదు స్థానాలు ఎగబాకింది.  ముందస్తు వీసా పొందకుండానే వారి హోల్డర్లు యాక్సెస్ చేయగల గమ్యస్థానాల సంఖ్య ప్రకారం ప్రపంచ పాస్‌పోర్ట్‌లను ర్యాంక్ చేసే ఈ అధ్యయనం, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ నుండి అధికారిక డేటాను ఉపయోగించి ర్యాంకింగ్స్ కేటాయిస్తారు.

తాజా నివేదిక ప్రకారం.. జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌లను రెండవ స్థానంలో ఉండగా.. ఆయా దేశాల వారు వీసా లేకుండా 190 గమ్యస్థానాలకు ప్రయాణించగలరు. యూకే రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానం నుండి నాల్గవ స్థానానికి చేరుకుంది. అమెరికా మరో రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. యూకే, అమెరికా సంయుక్తంగా 2014లో ఇండెక్స్‌లో 1వ స్థానంలో నిలిచాయి.

భారత్ కూడా గత జాబితా కంటే ఐదు స్థానాలు ఎగబాకి 80వ స్థానానికి చేరుకుంది. ఇండెక్స్ టాప్ 50లో ర్యాంక్ పొందిన ఏకైక గల్ఫ్ దేశం యూఏఈ అయితే, మధ్యప్రాచ్య గమ్యస్థానాలు ఇతర ప్రయాణికులకు మరింత అందుబాటులో ఉన్నాయి. కొత్త హెన్లీ ఓపెన్‌నెస్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 199 దేశాలకు వారు ముందస్తు వీసా లేకుండా ప్రవేశించడానికి అనుమతించే జాతీయుల సంఖ్యను బట్టి ర్యాంక్‌లు ఇచ్చారు.

జీసీసీలో ఒమన్ దూకుడు

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలలో ఒమన్ ఓపెన్‌నెస్ స్కోరు 2018 నుండి 71 నుండి 106 (35 పాయింట్లు)కి ఎగబాకింది. దీంతో సుల్తానేట్‌ 33వ స్థానంలో నిలిచింది. ఇది ఈ ప్రాంతంలో అత్యధికం. యూఏఈ స్కోరు 2018 నుండి 58 నుండి 80కి పెరిగింది (22 పాయింట్లు) అదే కాలంలో ఎమిరేట్స్ 55వ స్థానంలో ఉంది. ఖతార్ కూడా మెరుగుపడి 42వ స్థానంలో నిలిచింది. సౌదీ అరేబియా 72వ స్థానంలో, బహ్రెయిన్ 60వ స్థానంలో మరియు కువైట్ 68వ స్థానంలో ఉండటంతో ఇతర గల్ఫ్ దేశాలు ఇప్పటికీ ఓపెన్‌నెస్‌లో వెనుకబడి ఉన్నాయి.

ప్రపంచంలోని అతి తక్కువ శక్తివంతమైన పాస్‌పోర్ట్‌తో ఆఫ్ఘనిస్తాన్ జాబితాలో చివరన ఉంది. ఆ దేశ పాస్ పోర్ట్ హోల్డర్‌లు 27 దేశాలకు వీసా-రహితంగా ప్రయాణించగలరు. ఇరాక్, సిరియా మరియు పాకిస్తాన్ దిగువ నుంచి నాలుగు స్థానాల్లో నిలిచాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com