బీపీ, షుగర్‌ని వాకింగ్‌తో కంట్రోల్ చేయొచ్చా.?
- July 21, 2023వాకింగ్ వల్ల బరువు తగ్గుతామన్న సంగతి తెలిసిందే. పైకి కనిపించేంతలా బరువు తగ్గకపోయినా, శరీరం లైట్ వెయిట్ అయ్యి ఫ్లెక్సిబుల్‌గా అనిపిస్తుంది. వాకింగ్‌తో కేవలం ఇదొక్కటే ప్రయోజనమా.? అంటే కాదండీ. బీపీ, షుగర్ కూడా కంట్రోల్లో వుంటాయ్.
వాకింగ్ చేయడం వల్ల కేలరీలు బర్న్ అయ్యి వేస్ట్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే, రక్తపోటు నియంత్రణలో వుంటుంది. వాకింగ్‌లో రెండు రకాలుంటాయ్. స్లోగా అడుగులో అడుగేసుకుంటూ నడవడం ఒకటైతే, స్పీడ్ వాక్ ఇంకో రకం.
రోజులో మూడు సార్లు స్పీడ్ వాక్ చేయడం వల్ల రక్తనాళాల్లో ధృడత్వం తొలిగిపోయి రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది. తద్వారా రక్తపోటు సమస్య తీరుతుంది. అలాగే, తిన్న తర్వాత కాసేపు నడిచే నడక రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో వుంచేందుకు తోడ్పడుతుంది.
మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, భోజనం తర్వాత కనీసం 10 నుంచి 15 నిముషాలు నడిచే నడక డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం అని నిపుణులు చెబుతున్నారు.
ఇక రెగ్యులర్‌గా చేసే వాకింగ్ కీళ్ల నొప్పుల్నీ, మోకాళ్ల నొప్పుల్నీ కంట్రోల్లో వుంచుతుంది. కీళ్లకు మద్దతునిచ్చే కండరాలను నడక ద్వారా బలోపేతం చేసుకోవచ్చు. తద్వారా కీళ్ల నొప్పులు తగ్గించుకోవడంలో నడక మంచి ప్రయోజనకారి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు