కెరీర్‌ ఫెయిర్‌లో టాలెంట్‌ హంట్‌

- May 15, 2016 , by Maagulf
కెరీర్‌ ఫెయిర్‌లో టాలెంట్‌ హంట్‌

16వ యూఏఈ కెరీర్‌ ఫెయిర్‌ సోమవారం ప్రారంభమవుతుంది. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్లఓ ప్రారంభమయ్యే ఈ ఫెయిర్‌లో 31 దుబాయ్‌ ప్రభుత్వ సంస్థలు, 800 ఉద్యోగాలతో ఔత్సాహికుల్ని ఆకర్షించనున్నాయి. దుబాయ్‌ గవర్నమెంట్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో కెరీర్‌ ఎగ్జిబిషన్‌ మే 16 నుంచి 18 వరకు జరుగుతుంది. 'షేపింగ్‌ ఫ్యూచర్‌' అనే కాన్సెప్ట్‌తో ఈ ఫెయిర్‌ని నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో టాలెంటెడ్‌ యువతకు ఈ ఫెయిర్‌ ద్వారా ఉద్యోగావకాశాల్ని కల్పించనున్నారు. కొత్తగా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యూఏఈ పౌరులకు ఇక్కడ అవకాశాలు దక్కనున్నాయి. ఈ ఎగ్జిబిషన్‌లో మాస్టర్‌ క్లాసెస్‌, వర్క్‌షాప్స్‌, ఇంటరాక్టివ్‌ ఈవెంట్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగినవారికి కూడా వీలుగా ఈ ఎగ్జిబిషన్‌లో ఏర్పాట్లున్నాయి. రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ కూడా ఈ ఎగ్జిబిషన్‌లో భాగస్వామ్యం పంచుకుంటోంది. రెండేళ్ళపాటు ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించి, ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ అందిస్తామనీ, ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక రివార్డులు అందిస్తామని ఆర్‌టిఏ ప్రతినిథులు చెప్పారు. దుబాయ్‌ కస్టమ్స్‌ 128 వేకెన్సీలను ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా ఔత్సాహికులతో భర్తీ చేయాలనుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com