పూరీ అలా అనుకుంటున్నాడా.?
- July 22, 2023
ఒకప్పుడు డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌తో సినిమాలు చేయాలని హీరోలూ, హీరోయిన్లు సైతం వెంపర్లాడేవారు. కానీ, ఇఫ్పుడు పూరీ కెరీర్ డౌన్ ఫాల్లో నడుస్తోన్న సంగతి తెలిసిందే.
దీంతో, ఆయన సినిమాల్లో నటించాలంటే హీరోలూ, హీరోయిన్లు కూడా కాస్త తటపటాయిస్తున్నారు. అనేక రకాల షరతులు విధిస్తున్నారట. ‘లైగర్’ సినిమా డిజాస్టర్ రిజల్టే పూరీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైంది.
ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా చేస్తున్నాడు పూరీ జగన్నాధ్. గతంలోనే రామ్ పోతినేని ఈ సినిమాకి కమిట్ అయిపోయాడు. సో, చేయాల్సి వస్తోంది. అలాగే, ఈ సినిమాతో పూరీ తానేంటో ప్రూవ్ చేసుకోవల్సిన పరిస్థితి కూడా వుంది.
ఇదిలా వుంటే, ఈ సినిమా కన్నా ముందే తానేంటో పూరీ జగన్నాధ్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడట. అందుకోసం తానే హీరోగా మారాలనుకుంటున్నాడట.
హీరో.. అంటే తన సినిమాల్లో వుండే హీరోల మాదిరి, రొమాన్సులూ గట్రా చేసేటోడు కాదట.
ఓ సీరియస్ టోన్డ్ థ్రిల్లర్ మూవీని తీసుకొని సొంత డైరెక్షన్లో యాక్ట్ చేయాలనుకుంటున్నాడట. లో బడ్జెట్‌తోనే ఇంటెన్స్‌గా ఈ సినిమాని వీలైనంత త్వరగా తెరకెక్కించేయాలనుకుంటున్నాడట పూరీ జగన్నాద్. ఈ ప్రచారంలో నిజమెంతో కానీ, పూరీ అనుకుంటే ఇదేమంత పెద్ద పని కాదు మరి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్‌కోచ్‌లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









