ప్రాణాంతక వ్యాధులు దూరం.! గోంగూరకు అంత శక్తి వుందా.?

- July 22, 2023 , by Maagulf
ప్రాణాంతక వ్యాధులు దూరం.! గోంగూరకు అంత శక్తి వుందా.?

తెలుగు వారికి అత్యంత ప్రత్యేకమైన ఆకుకూర గోంగూర. గోంగూరను ఇష్టపడని వారుండరు. పెళ్లయినా, పేరంటమైనా, గోంగూర రోటి పచ్చడి వుండాల్సిందే. అలాగే, వెజ్ మరియు నాన్ వెజ్ ఐటెమ్స్‌లోనూ గోంగూరను మిక్స్ చేసి వాడడం ప్రత్యేకమైన వంటకంగా పరిగణించడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే, గోంగూరను కేవలం ప్రెస్జీజియస్ డిష్‌గానే కాకుండా, ఆరోగ్యానికి సూచికగానూ చెబుతున్నారు నిపుణులు. గోంగూరలో రోగనిరోధక శక్తిని పెంచే శక్తి చాలా ఎక్కువట.
అలాగే రక్త హీనత రాకుండా గోంగూర కాపాడుతుందట. ఐరన్ లోపం వున్నవాళ్లు రెగ్యులర్‌గా గోంగూరను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

తరచూ నీరసంతో బాధపడేవారు గోంగూరను తమ డైట్‌లో చేర్చుకుంటే నీరసం నుంచి ఉపశమనం పొందే అవకాశముంటుందట. అధిక రక్తపోటుకు గోంగూర చాలా మంచిదట. రక్తపోటు కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల ప్రమాదం వుంటుంది. 

అందుకే రక్తపోటు అదుపులో వుండాలంటే, గోంగూరను తినడం మర్చిపోకండి. అలాగే పలు రకాల దీర్ఘకాలిక వ్యాధుల్ని సైతం నియంత్రణలో వుంచే శక్తి గోంగూరకుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com