ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో రూ.712 కోట్లు మోసం

- July 22, 2023 , by Maagulf
ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో రూ.712 కోట్లు మోసం

హైదరాబాద్: హైదరాబాద్ లో ఘరానా మోసాలకు పాల్పడుతున్న సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు అయింది. ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా రూ.712 కోట్ల ఫ్రాడ్ చేసిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతిపెద్ద సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ని ఛేదించారని తెలిపారు.

ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా రూ.712 కోట్ల ఫ్రాడ్ చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా ఈ మోసాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ఫ్రాడ్ లో 15 వేల మంది బాధితులు ఉన్నారని తెలిపారు. ఆన్ లైన్ లో టాస్క్ లు ఇచ్చి.. మొదట డబ్బులు ఇచ్చి… ఆ తర్వాత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ మెంట్ చేసిన తర్వాత మోసం చేస్తున్నారని చెప్పారు.

టాస్క్ ఓరియెంటెడ్ జాబ్స్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా ఇందులో బాధితులున్నారని తెలిపారు. చైనా, దుబాయ్ కేంద్రంగా ఈ ఫ్రాడ్ జరుగుతోందన్నారు. ఇక్కడ ఎజెంట్లను నియమించుకుని, షెల్ కంపెనీలు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి.. వచ్చిన డబ్బును చైనా, దుబాయ్ నుండి ఆపరేట్ చేస్తున్నారని వెల్లడించారు.

అకౌంట్స్ లో ఉన్న డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. శివకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేశామని తెలిపారు. నిందితులకు చెందిన 48 అకౌంట్స్ లో రూ.584 కోట్లు జమయ్యాయని తెలిపారు. మరో రూ.128 కోట్లు ఇతర అకౌంట్స్ లో జమయ్యాయని పేర్కొన్నారు.

ఫేక్ పేపర్స్ తో లక్నోలో 33 షెల్ అకౌంట్స్, 65 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారని వెల్లడించారు. ఫ్రాడ్ చేసిన డబ్బును ఈ షెల్ కంపెనీలు, అకౌంట్స్ లో డిపాజిట్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఫ్రాడ్ చేసిన డబ్బుని క్రిప్టో కరెన్సీగా ట్రాన్స్ ఫర్ చేసుకుని… దుబాయ్, చైనా లో విత్ డ్రా చేసుకుంటున్నారని తెలిపారు. చైనా, దుబాయ్ లో ఉన్న ప్రధాన నిందితులకు ఇండియాలో సహకరిస్తున్న 9 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.

ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ చేసిన డబ్బుని క్రిప్టో కరెన్సీకి మార్చి… ఆ క్రిప్టో కరెన్సీని హిజ్బుల్లాకి సంబంధించిన టెర్రర్ మాడ్యూల్ కి ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించామని తెలిపారు. ఇక్కడ ఫ్రాడ్ చేసిన డబ్బును టెర్రరిస్టులకు ఫైనాన్స్ చేసే అవకాశం కూడా ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com