ప్రాణాంతక వ్యాధులు దూరం.! గోంగూరకు అంత శక్తి వుందా.?
- July 22, 2023తెలుగు వారికి అత్యంత ప్రత్యేకమైన ఆకుకూర గోంగూర. గోంగూరను ఇష్టపడని వారుండరు. పెళ్లయినా, పేరంటమైనా, గోంగూర రోటి పచ్చడి వుండాల్సిందే. అలాగే, వెజ్ మరియు నాన్ వెజ్ ఐటెమ్స్‌లోనూ గోంగూరను మిక్స్ చేసి వాడడం ప్రత్యేకమైన వంటకంగా పరిగణించడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే, గోంగూరను కేవలం ప్రెస్జీజియస్ డిష్‌గానే కాకుండా, ఆరోగ్యానికి సూచికగానూ చెబుతున్నారు నిపుణులు. గోంగూరలో రోగనిరోధక శక్తిని పెంచే శక్తి చాలా ఎక్కువట.
అలాగే రక్త హీనత రాకుండా గోంగూర కాపాడుతుందట. ఐరన్ లోపం వున్నవాళ్లు రెగ్యులర్‌గా గోంగూరను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
తరచూ నీరసంతో బాధపడేవారు గోంగూరను తమ డైట్లో చేర్చుకుంటే నీరసం నుంచి ఉపశమనం పొందే అవకాశముంటుందట. అధిక రక్తపోటుకు గోంగూర చాలా మంచిదట. రక్తపోటు కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల ప్రమాదం వుంటుంది.
అందుకే రక్తపోటు అదుపులో వుండాలంటే, గోంగూరను తినడం మర్చిపోకండి. అలాగే పలు రకాల దీర్ఘకాలిక వ్యాధుల్ని సైతం నియంత్రణలో వుంచే శక్తి గోంగూరకుందట.
తాజా వార్తలు
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్‌లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు