ఏం చేసినా చుండ్రు సమస్య తీరడం లేదా.?
- July 29, 2023డేండ్రఫ్ కారణంగా నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఓ మాదిరి చుండ్రు సమస్య వుంటే ఫర్వాలేదు కానీ, విపరీతంగా చుండ్రు సమస్య వేధిస్తుంటే, దాన్ని అస్సలు లైట్ తీసుకోకూడదు.
ఫంగల్ ఇన్ఫెక్షన్గా చెప్పబడే చుండ్రు బాధకు శాశ్వత పరిష్కారం ఫలానా అని చెప్పలేం కానీ, ఇంటి చిట్కాలను క్రమం తప్పకుండా వాడితే, చుండ్రు సమస్య నుంచి కొంత వరకూ ఉపశమనం పొందొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
వేపాకు పేస్ట్, నిమ్మరసం, పుదీనా పేస్ట్ ఇలా ఏది అందుబాటులో వుంటే దాన్ని పేస్ట్‌లా చేసి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని వారాల్లో చుండ్రు సమస్య తీరిపోతుంది.
బాగా ఎక్కువ సమస్య వుంటే, పెరుగులో ఉసిరి కాయ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని అరగంట సేపు తలకు బాగా పట్టించి తల స్నానం చేస్తే మంచి ఉపశమనం వుంటుంది.
మెంతులు కూడా చుండ్రును తగ్గించడంలో బాగా సహాయపడతాయ్. కలబంద గుజ్జుని కూడా వాడొచ్చు. ఏది వాడినా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు పాటిస్తేనే పలితం వుంటుందనేది నిపుణుల సలహా.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్‌లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!