వ్యక్తుల అక్రమ రవాణా సమస్య పరిష్కారానికి కృషి

- July 31, 2023 , by Maagulf
వ్యక్తుల అక్రమ రవాణా సమస్య పరిష్కారానికి కృషి

బహ్రెయిన్: వ్యక్తుల అక్రమ రవాణా సమస్యను పరిష్కరించడానికి బహ్రెయిన్ అంకితభావంతో కృషి చేస్తుందని కార్మిక మంత్రి, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చైర్మన్ జమీల్ హుమైదాన్ పునరుద్ఘాటించారు. వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా.. సమగ్ర మానవ హక్కుల వ్యవస్థను ప్రోత్సహించడంలో బహ్రెయిన్ పురోగతిని మంత్రి వివరించారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా దృఢమైన విధానం, క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి అయిన హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అనుసరణే ఈ ముఖ్యమైన విజయానికి కారణమని హుమైదాన్ పేర్కొన్నారు. HM రాజు నాయకత్వంలో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా దృఢమైన వైఖరితో పాటు సమానత్వం, కార్మికుల హక్కుల విలువలకు ప్రాధాన్యత ఇవ్వబడిందని, ముఖ్యంగా బహ్రెయిన్ వ్యక్తుల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో దాని ప్రయత్నాలకు ప్రపంచ గుర్తింపును పొందిందని తెలిపారు. ఈ విషయంపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదికలో వరుసగా ఆరవ సంవత్సరం కూడా బహ్రెయిన్ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. బహ్రెయిన్ విజయానికి దోహదపడిన అనేక కీలక కార్యక్రమాలను మంత్రి చెప్పారు. వేతనాల రక్షణ వ్యవస్థ అమలు, గృహ కార్మికులకు ఐచ్ఛిక బీమా వ్యవస్థను ప్రవేశపెట్టడం, ఫ్లెక్సిబుల్ వర్క్ పర్మిట్ల జారీ, గృహ కార్మికులకు త్రైపాక్షిక కాంట్రాక్టు ఏర్పాటు, నిర్బంధ కార్మికులకు వ్యతిరేకంగా అంకితభావంతో పోరాడటం వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com